తాటి చెట్లకు వైరస్‌ | - | Sakshi
Sakshi News home page

తాటి చెట్లకు వైరస్‌

Oct 24 2026 9:56 AM | Updated on Oct 24 2026 9:56 AM

తాటి చెట్లకు వైరస్‌ తప్పిపోయిన చిన్నారి తల్లిదండ్రులకు అప్పగింత 26న జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపిక ఏడుగురికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ పోక్సో కేసు నమోదు

చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామాల్లో గీత కార్మికులకు ఉపాధినిచ్చే తాటి చెట్లకు మొగి పురుగు సోకి తాటి ఆకులు రాలి మోడుగా దర్శనమిస్తున్నాయి. మండల పరిధిలోని గోనెపల్లి, రామునిపట్ల గ్రామాల్లో తాటి కల్లుకు డిమాండ్‌ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి కల్లు తాగడానికి వస్తుంటారు. కానీ తాటి చెట్లకు మొగి పురుగు సోకడంతో మోకు, ముత్తాడు మూలకు చేరాయి. దీంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ప్రభుత్వం మొగి పురుగు నివారణకు ప్రత్యేక చొరవ చూపి గీత కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు.

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల్లో తప్పిపోయిన చిన్నారిని క్యూఆర్టీ పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాన్స్‌వాడకు చెందిన మోహన్‌ , సంధ్య దంపతులు తమ పిల్లలతో కలిసి ఏడుపాయలకు వచ్చారు. జనాలు ఎక్కువగా ఉండటంతో వారి నాలుగేళ్ల కుమారుడు మోక్షిత్‌ తప్పిపోయాడు. అతని కోసం తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌, క్విక్‌ రెస్పాన్స్‌ టీం పోలీసులకు సమాచారం అందించడంతో వారు మోక్షిత్‌ ఆచూకీ కనుగొని, తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ పుణ్యకేత్రాలకు, పర్యాటక కేంద్రాలకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి భాస్కర్‌రెడ్డి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఈ నెల 26న స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి భాస్కర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. 26న ఉదయం 9గంటల నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించి, అందులో రాణించిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. హాజరయ్యే క్రీడాకారులు నిర్ణిత సమయంలో రిపోర్ట్‌ చేయాలన్నారు. పూర్తి వివరాలకు కర్రొల్ల వెంకటస్వామి గౌడ్‌ (97040 61543)ను సంప్రదించాలని సూచించారు.

మద్దూరు(హుస్నాబాద్‌): మైనర్‌ బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చేర్యాల సీఐ రమేశ్‌ కథనం ప్రకారం.. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉండటంతో వారిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. మిగిలిన నిందితులను న్యాయస్థానంలో హజరుపచరగా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కాగా నిందితులకు హుస్నాబాద్‌ ఏసీపీ సదానందం పర్యవేక్షణలో ర్యాపిడ్‌ కిట్ల సహాయంతో నిర్వహించిన డ్రగ్స్‌ పరీక్షల్లో సేవించినట్లు నిర్ధారణ కాలేదని తెలిపారు.

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోక్సో కేసు నమోదైంది. ఎస్‌ఐ మహేశ్‌ వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌ బాలుడు మరో గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా వేధించాడు. దీంతో సదరు బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement