ప్లాంట్లలో నిర్వహణ సరిగా లేదు
సంగారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అసలే ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. అటు కొద్దిపాటి పెట్టుబడితోనే కొంతమంది నీటి వ్యాపారం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వారికి వరంగా మారింది. వాటర్ ప్లాంట్ల ద్వారా విక్రయిస్తున్న నీటిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే దాదాపు 100కు పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు వెలిశాయి. వీటిలో అధిక శాతం ప్లాట్లకు అనుమతులు లేకపోవడం గమనార్హం.
అనుమతులు గాలికి..
సంగారెడ్డి పట్టణంలో 100కు పైగా ఆర్వో ప్లాంట్లు ఉన్నాయి. కానీ వీటికి టైటిల్ లైసెన్స్ తదితర అనుమతులు లేవు. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీటి శుద్ధితో వృఽథా!
ఆర్వో వాటర్ ప్లాంట్‌లో ఒక వంతు నీటిని తయారు చేయాలంటే రెండో వంతులకు పైగా భూగర్భ జలాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రోజుకు వేల లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తున్నారు. శుద్ధి పేరుతో నీరు వృఽథాగా పోతుంది.
నిబంధనలు తప్పనిసరి
● నిర్వాహకులు తప్పకుండా వాల్టా చట్టాన్ని పాటించాలి. రెవెన్యూ, విద్యుత్ శాఖల అనుమతులు పొందాలి.
● మంచినీటి సరఫరాకు ఐఎస్‌ఐతో పాటు బీఎస్‌ఐ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి.
● ఇసుక కార్బన్ ఫిల్టర్ ఏర్పాటు చేసుకోవాలి.
● ఆర్వో ప్లాంట్ ద్వారా నీటిలో బ్యాక్టీరియాను నిర్మూలించే వ్యవస్థ ఉండాలి.
● వాటర్ ప్లాంట్‌లో బయోలాజికల్ బ్యాక్టీరియా పరీక్షలు తప్పకుండా నిర్వహించాలి.
శుద్ధి పేరిట నీటి వృఽథా
జిల్లాలో అసలే ఎల్‌నినో ప్రభావం
అనుమతులు లేకుండా వెలుస్తున్న వైనం
ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులు
పట్టించుకోని అధికారులు
పట్టణంలో ఆర్వో ప్లాంట్ నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. నాణ్యతలేని వాటర్ బాటిల్, ప్యాకెట్లు అందించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలి.
– ఉదయ్, సంగారెడ్డి


