పేకాట రాయుళ్ల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పేకాట రాయుళ్ల అరెస్ట్‌

Oct 24 2026 9:50 AM | Updated on Oct 24 2026 9:50 AM

పేకాట రాయుళ్ల అరెస్ట్‌ కంటెయినర్‌ ఢీకొని వ్యక్తికి గాయాలు

సిద్దిపేటఅర్బన్‌: పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. సిద్దిపేట త్రీటౌన్‌ సీఐ లక్ష్మీబాబు వివరాల ప్రకారం.. కొంత మంది పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసు సిబ్బంది వెళ్లి తనిఖీ చేయగా ఐదుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.14,220, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో సాజిద్‌పురకు చెందిన మహ్మద్‌ హబీబ్‌, గాంధీనగర్‌కు చెందిన మహ్మద్‌ హాజీ మలంగ్‌ బాబా, దుద్దెడకు చెందిన బూర్గుల నవీన్‌కుమార్‌, ఇందిరమ్మ కాలనీకి చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌, దుద్దెడకు చెందిన బండమీది వినోద్‌ ఉన్నారు. వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నర్సాపూర్‌లో ఐదుగురు..

నర్సాపూర్‌: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి కథనం ప్రకారం.. నర్సాపూర్‌కు చెందిన మల్లేశం, వెంకటరమణయ్య, రమేశ్‌, సుధాకర్‌, శంకర్‌ స్థానిక చౌరస్తా నుంచి సంగారెడ్డి మార్గంలోని ఓ ఇంటి సమీపంలో శుక్రవారం సాయంత్రం పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్‌ సిబ్బంది, స్థానిక పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13,910 నగదు, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నర్సాపూర్‌: రోడ్డు దాటుతుండగా కంటెయినర్‌ ఢీకొట్టడంతో వ్యక్తి గాయాలపాలయ్యాడు. వివరాలు ఇలా.. మండలంలోని మూసాపేటకు చెందిన ఎరుకల దశరథ శుక్రవారం మధ్యాహ్నం స్థానిక చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా బస్టాండు వైపు నుంచి వచ్చిన కంటెయినర్‌ ఢీకొట్టింది. దీంతో అతడు కిందపడగానే కంటెయినర్‌ టైరు ఎడమ కాలుపై నుంచి వెళ్లడంతో గాయమైంది. స్థానికలు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం దశరథను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కాగా దశరథ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కంటెయినర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ రంజిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement