చిన్నకోడూరు(సిద్దిపేట): డీజే సౌండ్కు భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపడి పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దకోడూరులో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కొనింటి శ్రీహరి, భార్య పల్లవి, మనస్విత్, కూతుళ్లు వివేక, సాత్విక రోజు మాదిరిగానే ఇంట్లో నిద్రిస్తున్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో దుర్గామాత నిమజ్జనం చేసే క్రమంలో డీజే ఏర్పాటు చేశారు. డీజే సౌండ్ శబ్దాలకు సమీపంలోని శ్రీహరికి చెందిన భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపడి నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై పడ్డాయి. వెంటనే అప్రమత్తమై బయటకు వచ్చారు. కుమారుడు మనస్విత్, కూతురు వివేకకు గాయాలు కావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శ్రీహరి దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పింది.
పలువురికి గాయాలు


