ముదిరాజ్‌లను బీసీ(ఏ)లో చేర్చొద్దు’ | - | Sakshi
Sakshi News home page

ముదిరాజ్‌లను బీసీ(ఏ)లో చేర్చొద్దు’

Oct 24 2026 9:50 AM | Updated on Oct 24 2026 9:50 AM

నిజాంపేట(మెదక్‌): సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన చేతివృత్తుల కులాల హక్కులకు భంగం కలగకుండా చూడాలని బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీసీ(ఏ) జాబితాలో ముదిరాజ్‌ కులాన్ని చేరుస్తామన్న ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగు స్వామి మాట్లాడారు. బీసీ(ఏ) జాబితాలో ఉన్న 57 కులాలు ఎక్కువగా చేతివృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నాయని, ఈ వర్గాల పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాలకు ఈ రిజర్వేషన్లే కీలకమని పేర్కొన్నారు. పరిమితంగా ఉన్న రిజర్వేషన్లలో కొత్త కులాలను చేర్చడం వల్ల ఇప్పటికే ఉన్న పేద వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పునరాలోచించి, వెంటనే ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వం జీవో ప్రకటన చేస్తే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో పలు బీసీ సంఘాల నాయకులు పంపరి నగేశ్‌, మంగళి రాజు, చాకలి బాలయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు.

జిల్లా రజక సంఘం అధ్యక్షుడు సంగు స్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement