అలయ్‌ బలయ్‌తో ఆత్మీయత | - | Sakshi
Sakshi News home page

అలయ్‌ బలయ్‌తో ఆత్మీయత

Oct 23 2026 7:24 AM | Updated on Oct 23 2026 7:24 AM

అలయ్‌ బలయ్‌తో ఆత్మీయత అటవీ సంరక్షణతో ఉద్గారాల తగ్గింపు నాలుగు లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలి

ఎంపీ సురేశ్‌ షెట్కార్‌

జహీరాబాద్‌ టౌన్‌: అలయ్‌ బలయ్‌తో అందరిమధ్య ఐక్యత, ఆత్మీయత పెరుగుతుందని ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు పేర్కొన్నారు. జహీరాబాద్‌ పట్టణంలోని బసవేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో లింగాయత్‌ సమాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో సురేశ్‌ షెట్కార్‌, కె.మాణిక్‌రావు, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం.శివకుమార్‌, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తన్వీర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ యూనూస్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ శిరీషరెడ్డి, కౌన్సిలర్లు, కుల సంఘాల నాయకులు, అన్నీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ,ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనాల వల్ల సమాజంలోని అని వర్గాల ప్రజల మధ్య ఐక్యత, ఆత్మీయత పెరుగుందన్నారు. ఈ సందర్భంగా బసవేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

● 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలే లక్ష్యం

● ఈడీఎఫ్‌ సలహాదారు హిషామ్‌ ముండోల్‌

పటాన్‌చెరు: అటవీ సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, పునరుత్పాదక ఇంధన వినియోగం ద్వారా 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని భారత్‌ సాధించవచ్చని పర్యావరణ రక్షణ నిధి (ఈడీఎఫ్‌) భారత ముఖ్య సలహాదారు హిషామ్‌ ముండోల్‌ పేర్కొన్నారు. ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని రుద్రారం గీతంలోని కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీలో గురువారం ‘ఉమ్మడి సుస్థిర శ్రేయస్సుకు ఒక భారతీయ మార్గం’అంశంపై ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఆర్థికాభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఎరువుల వినియోగాన్ని మెరుగుపరచడం, పశువుల దాణా పద్ధతుల్లో మార్పులు, మీథేన్‌్‌ ఉద్గారాల తగ్గింపు కీలకమన్నారు. ఇండోర్‌లో వ్యర్థాల వేర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. వాతావరణ విధానాలు, సుస్థిర అభివృద్ధిలో సాంకేతికత, మార్కెట్ల పాత్రపై విద్యార్థుల సందేహాలకు సమాధానాలిచ్చారు.

సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ

సభ్యుడు మాణిక్‌

పటాన్‌చెరు టౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడి, నాలుగు లేబర్‌ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు మానిక్‌ డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 25న నిర్వహించనున్న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పాశమైలారం పారిశ్రామికవాడలో గురువారం సీఐటీయూ నాయకులతో కలిసి కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లేబర్‌ కోడ్స్‌ అమలుతో కార్మికుల హక్కులకు నష్టం జరుగుతుందన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, వివిధ యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

తనిఖీల్లో పట్టుబడ్డ

మందుబాబులు

సంగారెడ్డి క్రైమ్‌: డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడ్డ మందుబాబులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించింది. బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద, స్థానిక ఐబీ వద్ద, బైపాస్‌లోని బసవేశ్వర విగ్రహం, పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీల్లో 18 మందిని ట్రాఫిక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గురువారం సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా మెదటి అదనపు న్యాయమూర్తి వి.లక్ష్మీకళ ముగ్గురికి రూ.2,000 మిగతా నలుగురికి రూ.1,500 మిగతా 11మందికి రూ.1000, మొత్తం రూ.23,000 జరిమాన విధించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement