కేంద్ర బృందం పరిశీలన
జహీరాబాద్: జహీరాబాద్, కోహీర్ మండలాల్లో సాగులో ఉన్న అల్లం పంటకు సోకిన తెగుళ్లను కేంద్ర బృందం పరిశీలించి అధ్యయనం చేసింది. హైదరాబాద్‌లోని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం(సీఐపీఎంసీ) ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారులు వెంకట్‌రెడ్డి, బసవన్నప్ప, అసిస్టెంట్ అధికారి ఉదయశంకర్, సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్త మౌనిక, డీడీఎస్–కేవీకే శాస్త్రవేత్త శైలజ, ఉద్యాన అధికారి సునీతలు హెచ్ఈఓ సతీష్‌లు సాగులో ఉన్న అల్లం పంటలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్గి తెగులును పోలిన తెగుళ్లు ప్రస్తుతం కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కొత్తగా వ్యాపించాయన్నారు. రాష్ట్రంలో సాగులో ఉన్న అల్లం పంటలపై ఇప్పుడు కనిపిస్తోందన్నారు. ఈ తెగులు కలుగ జేసే శిలీంధ్రం ‘ప్రాక్జిపై రీక్యులేరియా జిన్జబెరిస్’గా కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసీ రీసెర్చ్ వారు నిర్ధారించినట్లు పేర్కొన్నారు. నివారణ కోసం ప్రాపికోనజోల్ లేదా టెబుకోనజోల్ అనే మందు లీటరు నీటికి ఒక మిల్లీ లీటరుగా వేసి పైపాటుగా పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.


