ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు: రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని పోచారం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ముత్తంగి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన సదుపాయాలను పరిశీలించి, ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.


