రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్‌రెడ్డి
జోగిపేట(అందోల్): రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్‌రెడ్డి సూచించారు. జోగిపేటలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రేడ్ ఏ కు క్వింటాల్‌కు రూ.2,461 ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎం.జగన్మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, కౌన్సిలర్ అరుణ్‌కుమార్, మాజీ కౌన్సిలర్లు హరికృష్ణగౌడ్, శ్రీకాంత్, ప్రవీణ్, కో ఆప్షన్ సభ్యుడు జిషాన్, జోగిపేట మున్సిపల్ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు డీజే వెంకటేశ్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.


