మాజీ మంత్రి హరీశ్‌రావు ఎదుట వాపోయిన రైతు
గజ్వేల్: ‘మూడెకరాల్లో వరి సాగు చేశా.. కరెంట్ వస్తలేదని, మూడు రోజుల కోసం జనరేటర్‌ను రోజుకు రూ.4వేల చొప్పున కిరాయికి రూ.12వేలు, డీజిల్‌కు రూ. 9వేలు మొత్తంగా రూ.21వేలు ఖర్చుచేశా.. అయినా పొలం పారలే, ఖర్చు పెరిగిపోయింది. భారంగా మారి ఆపేసిన. మూడెకరాల్లో కేవలం అర ఎకరమే చేతికొచ్చింది..’ అంటూ గజ్వేల్ మండలం బూర్గుపల్లికి చెందిన రైతు అరవింద్‌రెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావు ఎదుట వాపోయారు. గురువారం ఎండిపోయిన వరి పొలాల పరిశీలనకు హరీశ్‌రావు.. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డిలతో కలిసి వచ్చారు. ఈ సందర్భంలో రైతులు ఒక్కొక్కరుగా తమ ఆవేదనను మాజీ మంత్రికి వివరించారు.


