నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంట గ్రామానికి చెందిన ఏంబరి నరే శ్(21), కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా స్నేహితులను కలిసేందుకు ఈ నెల 20న రాత్రి 10 గంటల సమయంలో తన బైక్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న పొలంలో నరేష్ మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా, ముఖంపై రక్తగాయాలతో నరేష్ విగతజీవిగా పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొని మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
నిజాంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడిన సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన ఉడుత నవీన్ రామాయంపేట నుంచి నిజాంపేటకు వస్తున్న క్రమంలో, నిజాంపేట గ్రామ శివారులో ఆయన ప్రయాణిస్తున్న స్కూటీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సిద్దిపేటకు తరలించారు.
రాంగ్‌రూట్‌లో వెళ్లి ఒకరు మృతి..
టేక్మాల్(మెదక్): రాంగ్‌రూట్‌లో వెళ్తున్న బైక్‌ను కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైన ఘటన టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లి సమీపంలోని 161వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై అరవింద్‌కుమార్ కథనం ప్రకారం.. కాద్లూర్ గ్రామానికి చెందిన కర్రోళ్ల మల్లేశం (34), పండుగకు స్వగ్రామానికి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన కుమ్మరి శంకర్ బైక్‌పై మల్లేశం రాంగ్‌రూట్‌లో బొడ్మట్‌పల్లి నుంచి అల్లాదుర్గం వైపు వెళ్తుండగా, పిట్లం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేశం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. శంకర్ సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారులో ఉన్న డ్రైవర్ అంకుష్, అతని తల్లి సునీతకు కూడా గాయాలయ్యాయి. మృతుడి తండ్రి గంగారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


