కొమురవెల్లి(సిద్దిపేట): గంజాయి దందా గుట్టుగా జోరుగా సాగుతోంది. పొరుగు ప్రాంతాల నుంచి దీనిని దిగుమతి చేసుకుంటున్న కొందరు వ్యాపారులు విక్రయాలు జరుపుతున్నారు. ఈ గంజాయికి విద్యార్థులు, యువత, మైనర్లు బానిసలుగా మారి, అటు ఆర్థికంగా అటు ఆరోగ్య పరంగా కష్టాలు కొనితెచ్చుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. చదుకుకోని వారితో పాటు ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు సైతం మత్తుకు బానిసవుతున్నారు. సిగరెట్‌లో పొగాకును తీసివేసి గంజాయి పౌడర్‌ను నింపుకొని పీలుస్తున్నారు. పాన్‌డబ్బాలు, టీస్టాళ్లు అడ్డాలుగా గంజాయి సరఫరా జరుగుతోంది.
భక్తుల సందడి ముసుగులో..
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులతో మండల కేంద్రం ఎప్పుడూ సందడిగా ఉంటోంది. ఇది గంజాయి విక్రయదారులకు వరంగా మారింది. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏమి చేస్తున్నారు? తెలుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. మండల కేంద్రాన్ని అడ్డాగా చేసుకుని కొందరూ అక్రమార్కులు గంజాయిని సరఫరా చేస్తుండటం గమనార్హం. యువతే లక్ష్యంగా వీరు అమ్మకాలు చేపడుతున్నారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ నగరాల నుంచి గంజాయి ప్యాకెట్లను, పౌడర్‌ను మండలంలో తెలిసిన వ్యక్తులకు రూ.200 నుంచి రూ.300లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. పాన్‌డబ్బాలు, పలు టీస్టాళ్లలో గంజాయి నింపిన సిగరెట్‌ను రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశిలిచ్చినా.. క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు, ఎకై ్సజ్ శాఖ అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నారు. మండలంలోని పోసాన్‌పల్లి, గురువన్నపేట జగదేవ్‌పూర్ మండలం కొండపోచమ్మ ఆలయానికి సమీపంలో గంజాయి విక్రయాలు జోరందుకోవడంతో ఇటీవల పలు ఘర్షణలు సైతం చోటుచేసుకున్నాయి. కొంత మంది మైనర్ విద్యార్థులకు కొమురవెల్లి పోలీసులు ఇటీవల కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టినట్లు సమాచారం. మండల వ్యాప్తంగా గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్న గంజాయిని పూర్తిగా అరికట్టాలని, విక్రయిస్తున్న ,సేవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
గతంలో గంజాయి విక్రయించిన పలువురిపై కేసులు నమోదు చేశాం. యువతపై వారి తల్లి దండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఎవరైనా గంజాయి విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తీసుకుంటాం.
–ఎస్‌ఐ మహేశ్
పాన్‌డబ్బాలు, టీ స్టాళ్లే అడ్డాలు
మత్తుకు బానిసవుతున్న యువత


