కత్తులతో దాడి చేసిన వారిపై కేసు | - | Sakshi
Sakshi News home page

కత్తులతో దాడి చేసిన వారిపై కేసు

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

కొండపాక(గజ్వేల్‌): మండల పరిధి వెలికట్ట క్రాస్‌ రోడ్డు వద్ద పలువురి యువకులపై కత్తులతో దాడి చేసి గాయపర్చిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు కుకునూరుపల్లి ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వెలికట్ట క్రాస్‌ రోడ్డు వద్ద ఒక హోటల్‌ ఎదుట వెలికట్టకు చెందిన ప్రభాస్‌, భాస్కర్‌, నరేందర్‌, రంజీత్‌ కుమార్‌, శ్రీనివాస్‌లు టీ తాగి బిల్లు చెల్లించి మోటార్‌ బైక్‌ తీస్తున్న క్రమంలో కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టే ప్రయత్నం చేయగా వారు అడ్డుకున్నారు. ఇంత వేగంగా రావడం ఏమిటని ప్రశ్నించడంతో మాటా మాటా పెరగడంతో కారులో ఉన్న రాజస్థాన్‌కు చెందిన కొండపాక మండలం రవీంద్ర నగర్‌లో ఉంటున్న రమేశ్‌, రాకేశ్‌, ధర్మపాల్‌ తమ వెంట ఉన్న కత్తులు రాడ్‌లతో దాడి చేసి గాయపర్చారు. అక్కడే టీ తాగుతున్న మరో వ్యక్తి చందుపై కూడా దాడి చేసి గాయపర్చారు. ప్రభాస్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కత్తితో దాడికి యత్నం.. ఒకరి అరెస్టు

మద్దూరు(హుస్నాబాద్‌): కత్తితో దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మద్దూరు మండల కేంద్రానికి చెందిన నాయిని మధు ఈనెల 20న తన తండ్రి శంకరయ్యపై దాడి చేస్తుండగా.. నాయిని రాకేశ్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో మధు కత్తితో రాకేశ్‌పై దాడికి యత్నించగా, రాచకొండ ఉమేశ్‌ అడ్డుకున్నాడు. ఈ ఘటనలో ఉమేశ్‌ ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మధును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ మహ్మద్‌ ఆసీఫ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement