గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్‌: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళా సాధికారిత, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్‌ మండలం పిప్రీలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును బుధవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..మహిళల అభ్యున్నతి, సంఘటిత శక్తిని మరింత బలోపేతం చేయడానికి మహిళా సమాఖ్య భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

పరాక్రమం భారత్‌ సొంతం

ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ బౌద్దిక్‌ ప్రముఖ్‌

రాయికోడ్‌(అందోల్‌): ప్రపంచ దేశాల్లో పరాక్రమం భారత దేశ సొంతమని రాష్టీయ్ర స్వయం సేవక్‌ సంఘ్‌ విభాగ్‌ బౌద్దిక్‌ ప్రముఖ్‌ ముత్యం కృష్ణ తెలిపారు. రాయికోడ్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సేవకులనుద్దేశించి మాట్లాడారు. 1925లో ఆవిర్భవించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ దేశ, ధర్మ రక్షణకు కృషి చేస్తోందన్నారు.

కిక్కిరిసిన బస్సులు

నారాయణఖేడ్‌: నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 70 వేల మంది వరకు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. విద్యాసంస్థలకు సైతం దసరా సెలవులు ఉండటంతో వలస వెళ్లినవారు, వివిధ ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్నవారు దసరా, బతుకమ్మ పండుగలకు సొంత గ్రామాలకు వచ్చి ఆనందంగా పండుగలు జరుపుకున్నారు. పండుగలు ముగియడంతోపాటు దసరా సెలవులు సైతం ముగియడంతో అందులో అత్యధికులు బుధవారం తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ప్రధానంగా ఖేడ్‌–హైదరాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

హత్నూరలో హైటెన్షన్‌

హత్నూర(సంగారెడ్డి): విజయదశమి దసరా పండుగ సందర్భంగా హత్నూరలో నిర్వహించిన రావణాసుర దహనం విషయంలో తలెత్తిన వివాదం ఉద్రిక్తతలకు దారి తీసింది. బుధవారం ఉదయం హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు హత్నూర బస్టాప్‌ వద్ద ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. శ్రీరాముడిని అవమానించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దుర్గామాత దీక్ష స్వాములను కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. మరోవైపు దళిత సంఘాల నాయకులు రావణాసుర దహనం సందర్భంగా దళిత సర్పంచ్‌పై వివక్ష చూపిన వారిపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఇరువర్గాల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మూడు గంటలసేపు రోడ్డుపై ఆందోళన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. హిందూ సంఘాలు, దళిత సంఘాల నాయకులు పోలీస్‌స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement