సింగూరులో పర్యాటకుల సందడి | - | Sakshi
Sakshi News home page

సింగూరులో పర్యాటకుల సందడి

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

పుల్‌కల్‌(అందోల్‌): దసరా సెలవులు రావడంతో సింగూరు ప్రాజెక్టు వద్ద బుధవారం పర్యాటకులు సందడి చేశారు. ప్రాజెక్టు గేట్‌ల వద్ద, జలవిద్యుత్‌కేంద్రం వద్ద, పార్కుల్లో పర్యాటకులు ఆహ్లాదంగా గడిపారు. జంట నగరాలు, ససంగారెడ్డి, జోగిపేట, సదాశివపేట, జహీరాబాద్‌ పట్టణాల నుంచి పర్యాటకులు సింగూరును సందర్శించి డ్యామ్‌ అందాలను తిలకించారు. మరమ్మతుల దృష్ట్యా సింగూరు డ్యామ్‌లో 3.5 టీఎంసీల నీటినే నిల్వ ఉంచడంతో డ్యామ్‌లో కాకుండా పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాడుతూ పర్యాటకులు పిల్లలు సేద తీరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement