అంబేడ్కర్‌ స్టేడియంలో దసరా వేడుకలు | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ స్టేడియంలో దసరా వేడుకలు

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

సంగారెడ్డి: పట్టణంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. రామమందిరంలో ప్రత్యేకంగా భజన కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భజన మండలి సభ్యులు, భక్తులు భజన కీర్తనలతో శ్రీసీతారాముల వారి సేవ ఊరేగింపు అంబేడ్కర్‌ స్టేడియం వరకు కొనసాగింది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ స్టేడియంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహేశ్వర శర్మ సిద్ధాంతి నిర్వహించిన జమ్మిపూజను జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు, కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమం ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ సినీ నేపథ్య గాయకులచే ఏర్పాటు చేసిన సంగీత విభావరి మంత్రముగ్ధులను చేసింది. చిన్నారులు, కళాకారుల ఆధ్యాత్మిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..సంగారెడ్డి ప్రజలందరితో కలిసి పండగలు జరుపుకోవడంలోనే తనకు సంతోషం ఉంటుందన్నారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై పిల్లలు మరింత శ్రద్ధ చూపాలని, బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి సరైన సమయానికి మందులు వాడేలా చూడాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement