చెడుపై మంచి విజయమే దసరా | - | Sakshi
Sakshi News home page

చెడుపై మంచి విజయమే దసరా

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

పటాన్‌చెరు: చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి స్టేడియంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, అనంతరం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శమీ పూజ నిర్వహించారు. ఆ తర్వాత మైత్రి స్టేడియంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో కలిసి రావణాసుర దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దసరా ధర్మం, సత్యం, న్యాయం, ధైర్యానికి ప్రతీకని పేర్కొన్నారు. నియోజకవర్గంతోపాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

దసరా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement