పటాన్‌చెరు టౌన్: తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరారు. కర్ణాటక రాష్ట్రం... కలబురిగిలోని బుద్ధ విహార్ ట్రస్ట్‌లో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి ఖర్గేను నీలం మధు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరంతో పాటు పలు అంశాలపై ఖర్గేతో నీలం మధు సుదీర్ఘంగా చర్చించారు. ఆయన ప్రస్తావించిన అంశాలపై ఖర్గే సానుకూలంగా స్పందించినట్లు నీలం మధు వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ‘‘హమ్ తుమారే సాత్ హై మధు’’అంటూ ఖర్గే నీలం మధును ప్రోత్సహించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు


