‘మిర్చి’కి విద్యుత్‌ గండం | - | Sakshi
Sakshi News home page

‘మిర్చి’కి విద్యుత్‌ గండం

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

కోతలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ● బోరు మోటార్ల ద్వారా నీరు ● పంటను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం

కోతలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ● బోరు మోటార్ల ద్వారా నీరు ● పంటను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం

మిర్చి సాగు చేసిన రైతులు కరెంటు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ పంట సాగు చేయాలన్నా నీరు ముఖ్యం. వర్షాలు లేకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రబీ పంటలకు సంబంధించి వర్షాలు పడకపోవడంతో కొందరు రైతులు బోరు బావులు, బోరు మోటార్ల ద్వారా పంటలకు నీరు పారిస్తున్నారు. కాగా విద్యుత్‌ సరఫరా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.

– మునిపల్లి(అందోల్‌):

మిర్చి సాగుకు తక్కువ నీటితో ఎక్కువ పంట సాధించాలనే లక్ష్యంతో కొందరు రైతులు పంట మధ్యలో 40 ఇంచుల కాల్వతీసి నీరు పారిస్తున్నారు. కాగా వర్షాల జాడ లేకపోవడంతో మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు అన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాలు లేక బోరు బావుల్లో నీరు సైతం రోజు రోజుకు అడుగంటి పోతుంది. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు మిర్చి మొక్కల మధ్య కాల్వలు తీసి బోరు మోటార్ల ద్వారా నీరు పారిస్తూ మొక్కలను సంరక్షించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా పంటలకు నీరు పారిస్తున్న సమయంలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందని రైతులు వాపోతున్నారు. తరచూ విద్యుత్‌ వస్తూ, పోతుండటంతో బోరు బావుల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఫలానా సమయంలో విద్యుత్‌ సరఫరా చేస్తామని అధికారులు ముందుగా చెబితే ఆ సమయంలో బోరు బావుల దగ్గర ఉండి పంటలకు నీరు పారించడానికి అవకాశం ఉంటుందని రైతులు అధికారులను కోరుతున్నారు.

విద్యుత్‌కు వేళాపాలా లేదా?

సమయ పాలన పాటించి ఏ సమయంలో విద్యుత్‌ సరఫరా చేస్తారో రైతులకు ముందుగా తెలియజేయాలి. సమయ పాలన లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడంతో పంటకు నీరు పారించడానికి ఇబ్బందులు పడుతున్నాం.

– అశోక్‌ (రైతు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement