సీఎం, మంత్రి ఫ్లెక్సీ దహనం | - | Sakshi
Sakshi News home page

సీఎం, మంత్రి ఫ్లెక్సీ దహనం

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

ఆరుగురిపై కేసు నమోదు

ఆరుగురిపై కేసు నమోదు

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): దసరా సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని రావణాసురుడి రూపంలో తయారు చేసి దహనం చేసిన ఆరుగురిపై కేసు నమోదైంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ధర్మసాగర్‌పల్లిలో చోటు చేసుకుంది. హుస్నాబాద్‌ ఏసీపీ సదానందం కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి గ్రామంలోని హనుమాన్‌ ఆలయం వద్ద కొందరు యువకులు ముందస్తు అనుమతి లేకుండా గుమికూడి ఫ్లెక్సీని దహనం చేసి, వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. గ్రామ సర్పంచ్‌ కరివేద చంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు ధర్మసాగర్‌పల్లికి చెందిన పోతరవేణి రాకేశ్‌, లోనే హరీష్‌, మొతుకు శ్రీకాంత్‌, గొండ అజయ్‌కుమార్‌, బండ అభిషేక్‌, ఎండి ఆరీఫ్‌పై కేసు నమోదు చేశారు. సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ అభిలాష్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement