గజ్వేల్‌రూరల్: స్నేహితులను కలిసి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బుధవారం గజ్వేల్ ఏసీపీ నరసింహులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొడకండ్లకు చెందిన చెన్నోజి విజయ కొడుకు అనిల్‌చారి(19) కూలీ పనులు చేస్తూ తల్లికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. దసరా పండుగ కావడంతో అమ్మమ్మ ఊరు శ్రీగిరిపల్లికి వచ్చాడు. పండుగ రోజున అనిల్‌చారి ప్రజ్ఞాపూర్‌లో ఉన్న తన స్నేహితులను కలిసి తిరిగి శ్రీగిరిపల్లికి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో సేయింట్ మేరీస్ స్కూల్ సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడు తీవ్ర గాయాలవ్వడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.


