ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
మిరుదొడ్డి(దుబ్బాక): తొగుట మండలం గుడికందుల గ్రామంలో జరిగి న ఘర్షణలో ఇద్ద రి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిరుదొడ్డి ఎస్‌ఐ సతీశ్, ఏసీపీ రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఈ నెల 20న దసరా పండుగ సందర్భంగా గుడికందులలో దళిత వర్గానికి చెందిన సూకూరి విజయ్ కుమార్ బెల్టు షాపు వద్ద మద్యం తాగుతున్నాడు. మద్యం విషయంలో విజయ్ కుమార్‌కు, బెల్టు షాపు నిర్వాహకులు గోనెపల్లి నర్సింహులు గౌడ్ కుమారులైన యాదగిరి గౌడ్, అనిల్ గౌడ్‌లతో తీవ్ర ఘర్షణ నెలకొంది. ఘర్షణలో విజయ్ కుమార్‌పై యాదగిరి గౌడ్, అనిల్ గౌడ్ విచక్షణా రహితంగా దాడి చేసి గాయపర్చారు. బాధితుడు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇరు వురి నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.


