మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
నర్సాపూర్ రూరల్: యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నర్సాపూర్ మండలం లింగాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పలపు సాయి కిరణ్ (26)కు దసరా రోజు గ్రామానికి చెందిన బోయిని మహేశ్‌తో కల్లు దుకాణం వద్ద జరిగిన గొడవలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయమై గ్రామ పెద్దల వద్దకు వెళ్లగా మరుసటి రోజు పంచాయితీ పెడదామని చెప్పారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అతడు బాత్రూంలో ఉన్న యాసిడ్ తాగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


