గుడికందులలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

గుడికందులలో ఉద్రిక్తత

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

● బెల్టుషాపు నిర్వాహకులు, మద్యం ప్రియుల మధ్య వివాదం ● ఒకరికి తీవ్ర గాయాలు ● పోలీసుల లాఠీఛార్జి..

● బెల్టుషాపు నిర్వాహకులు, మద్యం ప్రియుల మధ్య వివాదం ● ఒకరికి తీవ్ర గాయాలు ● పోలీసుల లాఠీఛార్జి..

మిరుదొడ్డి(దుబ్బాక): దసరా నేపథ్యంలో బెల్టు షాపు నిర్వాహకులు, మద్యం ప్రియులపై దాడి చేయడంతో ఓ యువకుడి తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన తొగుట మండలం గుడికందుల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మంగళవారం రాత్రి గ్రామస్తులు దసరా వేడుకల్లో నిమగ్నమయ్యారు. గ్రామంలో నర్సింహులు గౌడ్‌ నిర్వహిస్తున్న బెల్టు షాపులో మద్యం ధరల విషయంలో మద్యం ప్రియులతో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో మద్యం ప్రియు లపై బెల్టు షాపు నిర్వాహకులు దాడి చేశారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన విజయ్‌ తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. గాయపడ్డ వ్యక్తిని సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. బెల్టు షాపు ముందు గ్రామస్తులు గుమిగూడటంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ రవీందర్‌ రెడ్డి నేతృత్వంలో ర్యాపిడ్‌తో పాటు , మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు బెల్టుషాపు వైపు దూసుకెళ్తుండటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో ఒక దశలో పోలీసులు గ్రామస్తులపై ఒక్కసారిగా లాఠీచార్జి చేశారు. గ్రామస్తులను చెల్లా చెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బుధవారం ఉదయం నుంచి గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక పికెట్‌ ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement