రెడ్డిపల్లిలో చిరుత కలకలం | - | Sakshi
Sakshi News home page

రెడ్డిపల్లిలో చిరుత కలకలం

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

ఫేక్‌ సమాచారంగా నిర్ధారించిన అధికారులు

ఫేక్‌ సమాచారంగా నిర్ధారించిన అధికారులు

చేగుంట(తూప్రాన్‌): మండలంలోని రెడ్డిపల్లి శివారులో చిరుత కనిపించిందనే ప్రచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురైన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. దసరా సందర్భంగా పెద్దమ్మ ఆలయ సమీపంలో జమ్మి పూజలు నిర్వహించిన గ్రామస్తులు ఇళ్లలోకి వెళ్లిపోయారు. గ్రామం నుంచి వెళ్తున్న ఓ కారుకు పెద్దమ్మ ఆలయ సమీపంలో చిరుత రోడ్డు దాటుతూ కనిపించినట్లు కారును ఆపిన వ్యక్తులు ఫోన్‌లో చిరుతకు సంబంధించిన ఫొటోలను తీసి గ్రామంలోని పలు వాట్సప్‌ గ్రూపుల్లో పెట్టారు. ఫోన్‌లో చిరుతకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్‌ నర్సింహ ఫారెస్టు అధికారులకు సమాచారం అందించగా వల్లూర్‌ ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ రామనీల గ్రామానికి చేరుకొని పరిశీలించారు. కాగా చిరుతకు సంబంధించిన పాదముద్రలతో పాటు ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. అనంతరం చిరుత సంచరించినట్లు ప్రచారం చేసిన వ్యక్తులను పిలిపించి మాట్లాడారు. అడవి జంతువుల విషయంలో అసత్య ప్రచారాలు చేస్తే కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement