బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గీయుల ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గీయుల ఘర్షణ

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

పోలీసుల లాఠీఛార్జి

పోలీసుల లాఠీఛార్జి

శివ్వంపేట(నర్సాపూర్‌): దసరా సందర్భంగా మండల కేంద్రమైన శివ్వంపేటలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గీయులు ఘర్షణ పడ్డారు. సాయంత్రం గాంధీ విగ్రహం వద్ద జమ్మి పూజ నిర్వహిస్తున్న క్రమంలో మహేశ్‌గుప్తా(బీఆర్‌ఎస్‌), నవీన్‌గుప్తా(కాంగ్రెస్‌) వర్గీయుల మధ్య వాగ్వాదం, ఘర్షణ, తోపులాటతోపాటు ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. అంతకు ముందు కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కావాలనే మాజీ జడ్పీటీసీ మహేశ్‌ గుప్తా ఇంటి ముందు ఏర్పాటు చేశారని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కనిపించకుండా అడ్డుగా బీఆర్‌ఎస్‌ నాయకులు కావాలనే డీజేని అడ్డుపెట్టారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ఫ్లెక్సీకి అడ్డుగా ఉన్న డీజే తీసేయాలని అనడంతో ఇరు వర్గాల మధ్య గొడవలు మొదలై అక్కడి నుంచి జమ్మి పూజ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు నచ్చజెప్పినా వినిపించుకోక పోవడంతో లాఠీఛార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. తూప్రాన్‌ సీఐ వెంకటరాజు గౌడ్‌, ఎస్సై మధుకర్‌ రెడ్డి, ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలు వేర్వేరుగా రావణాసురుడి దహనం చేశా రు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement