‘సాక్షి కథనం’పై సజ్జనార్‌ ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి కథనం’పై సజ్జనార్‌ ప్రశంసలు

Oct 21 2026 8:08 AM | Updated on Oct 21 2026 8:08 AM

● ‘యువకిరణం స్పోర్ట్స్‌ క్లబ్‌’ వినూత్న ఆలోచనకు అభినందనలు ● ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో ట్వీట్‌

● ‘యువకిరణం స్పోర్ట్స్‌ క్లబ్‌’ వినూత్న ఆలోచనకు అభినందనలు ● ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో ట్వీట్‌

దుబ్బాక: యువకిరణం స్పోర్ట్స్‌క్లబ్‌ సేవలపై నగర సీసీ సజ్జనార్‌ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. భక్తితో పాటు సామాజిక బాధ్యతను జోడించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నవ సమాజ నిర్మాణ వేదికగా మార్చిన దుబ్బాక యువకిరణం స్పోర్ట్స్‌క్లబ్‌ సభ్యుల వినూత్న ఆలోచనపై సాక్షిలో వచ్చిన కథనం ( ఆధ్యాత్మికం..సామాజిక చైతన్యం)ను హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఎక్స్‌లో ట్యాగ్‌ చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. రెండు రోజుల క్రితం సామాజిక చైతన్యం తమ బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న యువకిరణం స్టోర్ట్స్‌క్లబ్‌ ఈ సారి.. దేవి మండపంపై 12 మంది ఉత్తమ ఐపీఎస్‌ అధికారుల ఫోటోలు, వారి సందేశాలతో కూడిన ప్లెక్సీలపై సాక్షి ప్రత్యేకంగా కథనం ప్రచురించింది. సాక్షిలో వచ్చిన కథనాన్ని చాలామంది పోలీసు అధికారులు ప్రత్యేకంగా చదవడంతో పాటుగా వారి గ్రూపుల్లో ,స్టేటస్‌లలో సైతం పెట్టుకోవడం విశేషం. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా డ్రగ్స్‌ నిర్మూలన, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నివారణ, రోడ్డు భద్రత వంటి కీలక అంశాలపై పోలీస్‌ అధికారుల సందేశాలతో ప్రజల్లో చైతన్యం నింప డం వారి ఆలోచనా పరిపక్వతకు నిదర్శనం. నిరంతరం సమాజ రక్షణ కోసం పనిచేసే పోలీసు అధికారుల సేవలను గుర్తించి వారిని యువతకు ఆదర్శంగా నిలిపేలా మండపాన్ని తీర్చిదిద్దిన క్లబ్‌నిర్వాహకుల ప్రయత్నాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షిని ప్రత్యేకంగా ఎక్స్‌ వేదికగా అభినందించారు. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఉన్నత ఆశయాలతో సమాజ హితం కోసం ముందడుగు వేసేందుకు ఈ ప్రయత్నం అందరికీ మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement