చిన్నకోడూరు(సిద్దిపేట): సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో జీవాల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్ఐ చంద్రమోహన్లతో కలిసి మాట్లాడారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 20 జీవాలు, 4 మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామానికి చెందిన వరకొట్టు లింగం ఆరు గొర్రెలు పోయినవని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం గ్రామానికి చెందిన అబ్దుల్ రహమాన్ అలియాస్ శేఖర్, గొల్లెన రాజు, బొంతల రాజు, గండికోట వెంకటేశ్‌లు జీవాల షెడ్లను లక్ష్యంగా చేసుకుని గ్రామాల్లో సంచరిస్తూ పగటి పూట రెక్కీ నిర్వహించేవారు. రాత్రి వేళల్లో దొంగిలించేవారు. వాటిని కేశవపట్నంలోని ఒక షెడ్లో ఉంచినట్లు వెల్లడించారు. వారిని అరెస్టు చేసి, వారి నుంచి జీవాలను, మొబైల్స్, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వేగంగా కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న ఎస్ఐ చంద్రమోహన్, సిబ్బందిని ఏసీపీ అబినందించారు.


