గిరిజనులు ఆర్థికంగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజనులు ఆర్థికంగా ఎదగాలి

Oct 21 2026 8:08 AM | Updated on Oct 21 2026 8:08 AM

ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్‌ మహారాజ్‌

ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్‌ మహారాజ్‌

కల్హేర్‌ (నారాయణఖేడ్‌): గిరిజనులు విద్య, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందాలని కొండాపూర్‌ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్‌ మహారాజ్‌ ఆకాంక్షించారు. సోమవారం నిజాంపేట మండలం బల్కంచెల్క తండా (భక్తిధామ్‌ తండా)లోని విశ్వపాలిని మందిరంలో భవానీ మాత దీక్షల విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మందిర ధర్మకర్త మూడ్‌ కిషన్‌ – లలిత దంపతుల ఆధ్వర్యంలో హోమం, ప్రసాద వితరణ, భోగ్‌ భండార్‌ తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు చుట్టుపక్కల తండాల నుంచి భవానీ మాత దీక్షాధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షలు విరమించారు. దీంతో తండాలో భక్తిపారవశ్యం నెలకొంది. ఈ కార్యక్రమంలో తండా ప్రముఖులు శంకర్‌, ఖట్రోత్‌ జైల్‌సింగ్‌, రాములు, రూప్‌సింగ్‌, కిషన్‌, సవాయ్‌సింగ్‌, మన్మోహన్‌నాయక్‌, జైపాల్‌, నరేందర్‌, పండరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement