నారాయణఖేడ్: మనూరు మండలం బోరంచ నల్లపోచమ్మ ఆలయం పర్యాటక ప్రాంతంగా బాసిల్లుతోంది. ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక చొరవతో ఎకోటూరిజం కోసం మొదటి విడతగా రూ.2 కోట్లు విడుదలయ్యాయి. ఏటా ఏప్రిల్‌లో ఏడు వారాల పాటు జాతర జరుగుతుంది.రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు కర్ణా టక, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటా రు. మంజీరా నదీ తీరాన ఆలయం ఉండటంతో నదిలో బోటింగ్, పర్యాటకుల విడిదికి ఏర్పాట్లు చేస్తున్నారు.మంజీరా నదిలో సుమారు 12 కిలోమీటర్లు బోటింగ్‌లో పర్యాటకులు పర్యటిస్తూ ఈఆలయాలను భక్తులు దర్శించుకొనే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎకో ప్రెండ్లీ కాటేజెస్ నిర్మించనున్నారు. బాంబోస్టిక్స్‌తో కాటేజెస్ నిర్మాణం, రెస్టారెంట్లు సైతం ఇదే తరహాలో నిర్మించనున్నారు. ఆలయానికి సీజీఎఫ్ కింద రూ.50 లక్షలు మంజూరయ్యాయి.


