చేర్యాల(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా.. పట్టణ కేంద్రానికి చెందిన కళ్యాడపు శ్రీనివాస్(40) స్థానిక పాత బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడ్ని స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆరు నెలల క్రితం మృతుడి తండ్రి నర్సయ్య కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇలా తండ్రీకొడుకులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడింది. మృతుడికి తల్లి, భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


