● మధు, సుచరితల గారాల పట్టి ● ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న కూతురు ● ప్రపంచంలోనే గొప్ప డిజైనర్‌గా చూడాలన్నదే వారి కోరిక..
దుబ్బాక: దుబ్బాక పట్టణానికి చెందిన వడ్లకొండ మధు కాంట్రాక్టర్. ఆయన భార్య సుచరిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఇద్దరు ఉన్నత విద్యావంతులు. వీరికి 1998లో వివాహం జరిగింది. ముందుగానే తమకు పాప అయినా అబ్బాయి అయినా ఒక్కరే చాలనుకున్నారు. పైగా అమ్మాయే కావాలని కోరుకున్నారు. వారు కోరుకున్నట్లుగానే 2001 నవంబర్ 6న కూతురు జన్మించింది. సంతోషపడిన మధు, సుచరిత వారి కూతురుకు హర్షిణి అని పేరు పెట్టుకున్నారు. ప్రస్తుతం హర్షిణి నిఫ్ట్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) పూర్తి చేసి హైదరాబాద్‌లోనే ప్రస్తుతం ప్రముఖ కంపెనీ టోన్స్ ఫ్యాషన్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తుంది.
హర్షిణీ అంటే పంచ ప్రాణాలు
మా కూతురు హర్షిణీ అంటే మాకు పంచ ప్రాణాలు. మా అన్నయ్యకు ఇద్దరు కుమారులు. దీంతో మా అన్న శ్రీధర్, వదినమ్మ సుభద్రతో పాటు మా అమ్మానాన్నలకు కూడా హర్షిణి అంటే చాలా ప్రేమ. మా ఇంట్లో ఆడపిల్ల ఒక్కతే కావడంతో అందరూ హర్షిణిని ఆప్యాయంగా, గారాబంగా చూసుకుంటారు. హర్షిణీని ప్రపంచంలోనే గొప్ప ఫ్యాషన్ డిజైనర్‌గా చూడాలన్నదే మా కోరిక.
లక్ష్మి కటాక్షం..
ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండటం ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం లాంటిది. ఇంట్లో ప్రతి ఒక్కరిపై ఆడపిల్ల ప్రేమను చూపిస్తుంది. ఆడపిల్ల ఉంటే ఎనలేని ధైర్యం ఉటుంది.
– నర్సింహా రెడ్డి, జహీరాబాద్
మా అమ్మానాన్నలంటే నాకు చాలా ఇష్టం. నన్ను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు. నన్ను ఏనాడు ఆడపిల్ల అన్న కోణంలో చూడలేదు. ఇలాంటి అమ్మానాన్నలకు నేను కూతురిగా పుట్టడం నా అదృష్టం. ఎప్పుడు నా ఇష్టాన్ని కాదనలేరు. ప్రపంచంలో గొప్ప ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు పొందాలనేది నా కోరిక.
–హర్షిణీ, ఫ్యాషన్ డిజైనర్


