దుబ్బాక ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

దుబ్బాక ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌

Sep 27 2026 2:09 PM | Updated on Sep 27 2026 2:09 PM

మహిళ కడుపులోంచి 6.1 కిలోల ఫైబ్రాయిడ్‌ గడ్డ తొలగింపు

మహిళ కడుపులోంచి 6.1 కిలోల ఫైబ్రాయిడ్‌ గడ్డ తొలగింపు

దుబ్బాక: దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిలో వైద్యులు అరుదైన ఆపరేషన్‌ చేసి మహిళ ప్రాణాలు కాపాడారు. దవాఖాన సూపరింటెండెంట్‌, ప్రముఖ సర్జన్‌ హేమరాజ్‌సింగ్‌ ఆధ్వర్యంలో శనివారం ఈ ఆపరేషన్‌ చేశారు. వివరాలు ఇలా..కామారెడ్డి జిల్లా ఫరీద్‌పేట గ్రామానికి చెందిన కవిత(44) కొన్నేళ్లుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ వివిధ ఆస్పత్రులకు వెళ్లినా నయం కాలేదు. ఈ క్రమంలో దుబ్బాక ఆస్పత్రికి రాగా ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించి కడుపులో ఫైబ్రాయిడ్‌ గడ్డ ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో ఆమెకు ఆపరేషన్‌ చేసి కడుపులోంచి 6.1 కేజీల గడ్డను తొలగించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో గైనకాలజిస్టు స్రవంతి, వైద్యులు ప్రేమ్‌కిశోర్‌, ఆస్మా, పూజ, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. కాగా శనివారం దుబ్బాక ఆస్పత్రిలో ఒకే రోజు ఆరోగ్యశ్రీ కింద 15 ఆపరేషన్లు చేసినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హేమరాజ్‌సింగ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement