కుమారుడికి తలకొరివి పెట్టిన తండ్రి | - | Sakshi
Sakshi News home page

కుమారుడికి తలకొరివి పెట్టిన తండ్రి

Sep 27 2026 2:09 PM | Updated on Sep 27 2026 2:09 PM

గజ్వేల్‌రూరల్‌: ఏ తండ్రి అయినా తాను మృతి చెందిన తర్వాత కొడుకు తల కొరివి పెడతాడని అనుకుంటాడు. కానీ.. కన్న కొడుకు మృతి చెందడంతో తండ్రి తలకొరివి పెట్టిన ఘటన గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ లక్ష్మాపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్న యాదాగౌడ్‌–భూలక్ష్మీ దంపతులకు కొడుకు నవీన్‌గౌడ్‌(30)తో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే నవీన్‌ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. చేతికందిన కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. తన చేతులతోనే చివరి మజిలీ కార్యక్రమాలు నిర్వహించాల్సి రావడంతో ఆ తండ్రి వేదనను చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ కన్నీంటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement