అర్జీల పరిష్కారం వేగవంతం
సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రాల్లో పకడ్బందీగా ప్రజావాణి కార్యక్రమం చేపట్టిందని అదనపు కలెక్టర్లు సంగీత, పాండు అన్నారు. సోమవారం సోమవారం కలెక్టరేట్‌లో వారు ప్రజల నుంచి వినతులు స్వీకరించగా, మండల కేంద్రాల్లో ఎంపీడీఓలు స్వీకరించారు. కలెక్టరేట్‌లో 79, సంగారెడ్డి డివిజన్‌లో 20, జహీరాబాద్‌లో 02, నారాయణఖేడ్‌లో 2 వినతులు అందగా, అందోల్ డివిజన్‌్‌లో ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. జిల్లావ్యాప్తంగా మండలాల్లో 55 దరఖాస్తులు రాగా, అత్యధికంగా రెవెన్యూకు సంబంధించిన సమస్యలే అత్యధికంగా వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా హౌసింగ్, పెన్షన్, ఆర్టీసీ, నిమ్జ్, ఉద్యోగ, ఉపాధి తదితర వాటిపై అర్జీలు వచ్చాయి.


