సంగారెడ్డి జోన్: ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి హాజరై ఫిర్యాదులు స్వీకరించారు. నేరుగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్నారు. సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి, సమస్య జాప్యానికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తమ సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


