రూ.6.79లక్షలు పలికిన వినాయక లడ్డూ | - | Sakshi
Sakshi News home page

రూ.6.79లక్షలు పలికిన వినాయక లడ్డూ

Sep 22 2026 10:02 AM | Updated on Sep 22 2026 10:02 AM

రూ.6.79లక్షలు పలికిన వినాయక లడ్డూ

రామచంద్రాపురం (పటాన్‌చెరు): తెల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని పలు గేటెడ్‌ కమ్యూనిటీలలో వినాయక మండపాల వద్ద లడ్డూ వేలం పాటలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. మైహోమ్‌ అంకురా కమ్యూనిటీలో నిర్వహించిన వేలంలో వడ్లమని సురేష్‌ రూ. 6.79 లక్షలకు వినాయక లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పీఏసీఎస్‌ చైర్మన్‌ బుచ్చిరెడ్డి ఘనంగా సన్మానించారు. అలాగే మాగ్నా మెజెస్టిక్‌ మెడోస్‌లో జరిగిన వేలం పాటలో డాక్టర్‌ సతీష్‌ రెడ్డి – డాక్టర్‌ ప్రీతి దంపతులు రూ. 3,41,555లకు లడ్డూను దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement