పటాన్‌చెరు టౌన్‌: ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధి రుద్రారంలోని గణేశ్‌గడ్డ దేవస్థానంలో కొలువైన గణేశుడు అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిచ్చారు. వినాయక ఉత్సవాలలో భాగంగా 8వ రోజు స్వామివారిని అన్నపూర్ణేశ్వరుడిగా అలంకరించారు. ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భ | - | Sakshi
Sakshi News home page

పటాన్‌చెరు టౌన్‌: ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధి రుద్రారంలోని గణేశ్‌గడ్డ దేవస్థానంలో కొలువైన గణేశుడు అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిచ్చారు. వినాయక ఉత్సవాలలో భాగంగా 8వ రోజు స్వామివారిని అన్నపూర్ణేశ్వరుడిగా అలంకరించారు. ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భ

Sep 22 2026 10:02 AM | Updated on Sep 22 2026 10:02 AM

పోటీ పడిన ముగ్గురు

ఇప్పటివరకు వరించని

డీసీసీ చీఫ్‌ పదవి

ఉజ్వల్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చినా ఆఖరి నిమిషంలో తారుమారు

జహీరాబాద్‌కు దక్కని యోగం

జహీరాబాద్‌: జహీరాబాద్‌ ప్రాంతానికి ఇప్పటివరకు ఒక్కసారి కూడ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవి దక్కలేదు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ ఇంచార్జి ఎస్‌.ఉజ్వల్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చినా, ఊహించని రీతిలో పదవి చే జారింది. అధిష్టానం సానుకూలంగా ఉన్నా, జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలంతా మద్దతు పలికినప్పటికీ పదవి దక్కలేదు. ఇది నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేసింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా, జిల్లాలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. ఆ పదవులను దక్కించుకునేందుకు ఉజ్వల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు.

ఎంపీ టికెట్‌ ఆశించినా..

2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు ఉజ్వల్‌రెడ్డి టికెట్‌ను ఆశించారు. టికెట్‌ కోసం అధిష్టాన వర్గం వద్ద ప్రయత్నాలు చేశారు. అయినా చివరి నిమిషంలో నారాయణఖేడ్‌కు చెందిన సురేష్‌ శెట్కార్‌ను వరించింది. ఆయన రెండు పర్యాయాలు ఎంపీగా పని చేయడంతో ఆయన వైపు మొగ్గు చూపింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి శెట్కార్‌ విజయం కోసం పనిచేశారు. పార్లమెంట్‌ పరిధిలోనే జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి శెట్కార్‌కు భారీ మెజార్టీ రావడంలో ఉజ్వల్‌రెడ్డి పాత్ర ఎంతో ఉందని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.

డీసీసీ అధ్యక్ష పదవి కోసం జహీరాబాద్‌కు చెందిన ఉజ్వల్‌రెడ్డితో పాటు నారాయణఖేడ్‌కు చెందిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి, పటాన్‌చెరుకు చెందిన సీనియర్‌ నాయకుడు కాట శ్రీనివాస్‌గౌడ్‌లు పోటీ పడ్డారు. అయినా రాష్ట్ర, ఢిల్లీ స్థాయిలో జరిగిన ఎంపికలో అధిష్టానవర్గం చివరకు చంద్రశేఖర్‌రెడ్డి పేరును ప్రకటించి ఉత్కంఠతకు తెరదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement