అడ్డగింతలు.. అభ్యంతరాలు | - | Sakshi
Sakshi News home page

అడ్డగింతలు.. అభ్యంతరాలు

Sep 22 2026 10:02 AM | Updated on Sep 22 2026 10:02 AM

ఆక్రమణలను తొలగించిన అధికారులు

జహీరాబాద్‌: పట్టణంలోని లతీఫ్‌ రోడ్డుపై వెలసిన ఆక్రమణలను తొలగించే క్రమంలో పలువురు అడ్డగించారు. మున్సిపల్‌ అధికారులు జేసీబీలతో రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు వెళ్లగా ఆయా కాలనీల పెద్దలు అభ్యంతరాలు చెప్పారు. ఒక దశలో జేసీబీలను అడ్డుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్పందించిన పోలీసులు, కమిషనర్‌ ప్రభాకర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు శ్రీనివాస్‌, శాంతకుమార్‌ వారికి నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గారు.అనంతరం ఆక్రమణల తొలగింపు పనులు కొనసాగాయి. మరో రెండు రోజుల పాటు పనులు యధావిధిగా చేపట్టనున్నారు. ఆక్రమణలను తొలగించడంతో షెడ్డులపై ఉన్న రేకులకు ఆక్రమణదారులు తరలించుకున్నారు. శిథిలాలను మున్సిపల్‌ సిబ్బంది జేసీబీ, టిప్పర్ల సహాయంతో పట్టణం బయటకు తరలించారు. గత వారం రోజుల క్రితం హనుమాన్‌ మందిర్‌ రోడ్డు, భవానీ మందిర్‌ రోడ్లపై ఉన్న ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్‌ అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో వ్యాపారులు, యజమానులు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించుకుంటున్నారు. లతీఫ్‌ రోడ్డుపై సైతం వ్యాపారులు తమ కట్టడాలను తొలగించుకుంటున్నారు. దీంతో 65వ జాతీయ రహదారి నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు శాశ్వతంగా తీరనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement