మార్కెట్‌ ఆధునీకరణలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ ఆధునీకరణలో జాప్యం

Sep 22 2026 10:02 AM | Updated on Sep 22 2026 10:02 AM

శిథిలావస్థలో గోదాంలు

కూలుతున్న గోడలు

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో ఏళ్ల కిత్రం నిర్మించిన గోదాములు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోదాంలు గోడలు కూలిపోతున్న మరమ్మతుల గురించి పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. 75 ఏళ్ల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా జహీరాబాద్‌ ప్రధానసెంటర్‌లో సుమారు మూడెకరాల విస్తీర్ణంలో ఈ అగ్రికల్చర్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. జహీరాబాద్‌, ఝరాసంగం, కోహీర్‌, న్యాల్‌కల్‌, మునిపల్లి మండలాల నుంచి అలాగే పొరుగునున్న కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి రైతులు తమ పప్పుధాన్యాలు, ఇతర పంట ఉత్పత్తులను విక్రయిచడానికి తీసువస్తుంటారు. మార్కెట్‌కు కమిషన్లు, దుకాణాల అద్దెల ద్వారా ఏటా సుమారు రూ.2 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. 2008లో ఈ మార్కెట్‌ను ప్రత్యేకశ్రేణి కింద అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ, నేటికీ ఆధునీకరణ పనులు మాత్రం చేపట్టలేదు. గోదాంలు శిథిలావస్థకు చేరి గోడలు కూలుతుండటంతోపాటు మార్కెట్‌లో కనీస సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ కరువై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి మార్కెట్‌ను ఆధునీకరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement