సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ ఐఐటీలో సోమవారం 11వ బాబుల్ ఎకో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్, పాస్టోరలిస్టస్ (ఐవైఆర్‌పీ)–2026ను పురస్కరించుకొని నిర్వహించిన ఈ ఫెస్టివల్‌లో సినిమాలు, చర్చలు, పర్యావరణ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈసందర్భంగా జర్మనీకి చెందిన ప్లానెట్‌షిప్, యూకేకు చెందిన ది బిగ్ స్టేప్పీ, ఇండియాకు చెందిన జీవైయూర్ ఎస్‌ఈ, భాగల్ వంటి సినిమాలు ప్రదర్శించారు. ఈసందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి మాట్లాడుతూ.. ప్రకృతితో మనకు ఉన్న సంబంధాలను ఈ చిత్రాలు ప్రతిభింబించాయని అన్నారు. రేంజ్‌ల్యాండ్స్, పశుసంపద, పశువుల కాపరులు, గడ్డిభూములు, గొర్రెల కాపరు లు, వాతావరణ మార్పులు భారతదేశంతో పాటు, వివిధ దేశాల చిత్రాలను ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించామని తెలిపారు. కార్యక్రమంలో లిబరల్ ఆర్ట్స్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ రష్మిసింగ్, బాబుల్ ఎకో ఫిల్మ్ ఫెస్టి వల్ డైరెక్టర్ గంగాధర్ పాండే తదితరులు పాల్గొన్నారు.


