51% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

51% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించాలి

Sep 22 2026 10:02 AM | Updated on Sep 22 2026 10:02 AM

టీపీటీఎఫ్‌ జిల్లా కమిటీ డిమాండ్‌

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: 51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్‌సీ ప్రకటించి వేతన సవరణ చేపట్టాలని టీపీటీఎఫ్‌ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. సోమవారం జిల్లాలోని ఉపాధ్యాయ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌, ప్రధాన కార్యదర్శి రాంచందర్‌ మాట్లాడారు. జిల్లాలో మంజూరైన 132 ప్రీ–ప్రైమరీ పాఠశాలలకు ఎంపిక జాబితా విడుదల చేసి మూడు నెలలవుతున్నా ఇన్‌స్టక్టర్లు, ఆయాల నియామకాలు చేపట్టలేదని, తక్షణమే వారిని నియమించాలని కోరారు. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్‌, గుమ్మడిదల, జిన్నారం మండలాలకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్‌ బిల్లులు చెల్లించి, ఆరు డీఏలను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 26న నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్లు రాజారెడ్డి, జీవన్‌రావు, ఉపాధ్యక్షులు మల్లికార్జున్‌, విజయభాస్కర్‌, నాసర్‌పటేల్‌, జిల్లా కార్యదర్శులు జగన్నాథం, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement