విద్యార్థుల పానీ పాట్లు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల పానీ పాట్లు

Sep 22 2026 10:02 AM | Updated on Sep 22 2026 10:02 AM

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): మండల పరిధిలోని రేజింతల్‌ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తాగు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా పాఠశాలకు తాగు నీటి సరఫరా సక్రమంగా కాకపోవడంతో హోటళ్లు, ఇతర ప్రాంతాలను ఆశ్రయిస్తున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న బోరు ద్వారా విద్యార్థులకు తాగు నీటి సరఫరా జరిగేది. అయితే కొన్ని రోజులుగా ఆ బోరు ద్వారా గ్రామానికి నీటి సరఫరా జరుగుతుందని, ఫలితంగా పాఠశాలకు నీటి సరఫరా నిలిచిపోయిందని మాజీ సర్పంచ్‌ కుత్బొద్దీన్‌ తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి సోమవారం విద్యార్థులకు మంచి నీటిని అందించారు. అధికారులు చర్యలు తీసుకొని పాఠశాలలలో నెలకొన్న తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement