సర్వర్‌ సతాయిస్తోంది! | - | Sakshi
Sakshi News home page

సర్వర్‌ సతాయిస్తోంది!

Sep 8 2026 7:21 AM | Updated on Sep 8 2026 7:21 AM

ఆ ప్రాంత వివరాలు

సైబరాబాద్‌ కార్పొరేషన్‌కు

జనగణనలో భాగంగా విలేజ్‌ డైరెక్టరీల తయారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయా గ్రామాల్లోని మౌలిక సదుపాయాల వివరాలను నమోదు చేసే ఓఆర్‌జీఐ వెబ్‌సైట్‌ సర్వర్‌ సతాయిస్తోంది. దీంతో ఆయా గ్రామాలు, పట్టణాల సమూల సమాచారాన్ని జీపీఓలు క్రోడీకరించినప్పటికీ.. ఆ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

నగణన (సెన్సస్‌)లో భాగంగా ఇప్పటివరకు హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ (ఇండ్ల గణన) చేసిన ప్రభుత్వం, ఇప్పుడు విలేజ్‌ డైరెక్టరీ (గ్రామ సమాచార దర్శని), మున్సిపాలిటీలకు సంబంధించి టౌన్‌ డైరెక్టరీలను రూపొందిస్తున్న విషయం విధితమే. గ్రామ, పట్టణానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొత్తం తొమ్మిది రకాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల వివరాలను ఈ డైరెక్టరీల్లో నమోదు చేశారు. పాఠశాలలు, వివిధ రకాల కళాశాలలు వంటి విద్యా పరమైన సౌకర్యాలు, ఆసుపత్రులు.. వాటిల్లో అందించే వైద్య సేవలు.. ఆయా గ్రామంలో ఇవి లేకపోతే ఎంత దూరంలో అందుబాటులో ఉన్నాయనే వివరాలను సేకరించారు. తాగునీటి వసతి, డ్రైనేజీలు.. బస్సు, రైలు, విమాన వంటి రవాణ సదుపాయాలతో పాటు కమ్యునికేషన్స్‌ వంటి వివరాలను కూడా ఈ డైరెక్టరీలో పొందుపరుస్తున్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు.. సాగు భూమి.. గ్రామ/ పట్టణ భౌగోళిక వివరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, చేతివృత్తులు ఇలా మొత్తం తొమ్మిది అంశాలకు సంబందించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

మూడో వంతు గ్రామాలకే..

జిల్లాలో 647 పంచాయతీలు ఉన్నాయి. 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటికి గ్రామ, పట్టణ డైరెక్టరీలను తయారు చేస్తున్నారు. ఆగస్టు 10 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు ఆఫీసర్లు ఈ గ్రామ సమాచారాన్ని సేకరిస్తున్నారు. నెల రోజుల పాటు కొనసాగిన ఈ ప్రక్రియ నేటితో ముగియాల్సి ఉంటుంది. కానీ సర్వర్‌ సమస్య కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈవివరాలన్నింటిని నమోదు చేసే ఓఆర్‌జీఐ వెబ్‌సైట్‌ సర్వర్‌ తరచూ సతాయిస్తోందని జీపీఓ (పంచాయతీ కార్య దర్శులు) వాపోతున్నారు. ఒక్కో సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటే సమయం బాగా తీసుకుంటోందని, తీరా వివరాలన్నీ టైప్‌ చేశాక సర్వర్‌ సమస్య కారణంగా సేవ్‌ కావడం లేదని చెబుతున్నారు. దీంతో 647 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటివరకు సుమారు 450 పంచాయతీల్లోనూ ఈ ప్రక్రియ పూర్తికాలేదని అంటున్నారు. దీంతో ఈ గడువు మరికొన్ని రోజులు పొడగించాల్సిన పరిస్థితి నెలకొంది.

విలేజ్‌, టౌన్‌ డైరెక్టర్‌ రూపకల్పనకు సాంకేతిక సమస్యలు

గ్రామాల, పట్టణాల్లో మౌలిక వసతుల వివరాల సేకరణ

ఆన్‌లైన్‌లో నమోదుకు మొరాయిస్తున్న

ఓఆర్‌జీఐ వెబ్‌సైట్‌

నేటితో ముగియనున్న నిర్దేశిత గడువు

జిల్లా పరిధిలో ఉండే పటాన్‌చెరు, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం, వంటి ప్రాంతాల్లోని ఈ వివరాలను జిల్లా అధికారులు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు పంపారు. ఈ వివరాలను ఆ కార్పొరేషన్‌ అధికారులే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement