ఐఐటీహెచ్‌లో ఇగ్నైట్‌ సదస్సు | - | Sakshi
Sakshi News home page

ఐఐటీహెచ్‌లో ఇగ్నైట్‌ సదస్సు

Sep 8 2026 7:21 AM | Updated on Sep 8 2026 7:21 AM

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వినియోగదారుల అవసరాలు, నూతన సాంకేతికత, ప్రయోగాలు, నిరంతర అభ్యాసనతోనే నిజమైన మార్పు సాధ్యమవుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాజీ సీఎండీ డాక్టర్‌ అనిల్‌ ఖండేల్వాల్‌ అన్నారు. హైదరాబాద్‌ ఐఐటీలో గెయిల్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, ఎంస్నీ ఫౌండేషన్‌, ఐటీఐసీ ఇంక్యుబేటర్‌ ఆధ్వర్యంలో ‘ఎంసీ 2 ప్లస్‌ ఇగ్నైట్‌ హైదరాబాద్‌ కనెక్ట్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గెయిల్‌ సీఎండీ దీపక్‌గుప్త మాట్లాడుతూ.. భారత్‌లో ఇంధన అవసరాలు వేగంగా పెరుగుతున్న తరుణంలో స్వచ్ఛమై న ఇంధనం, ఇంధన భద్రత, సాంకేతిక స్వావలంబనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌, సెన్సార్లు, రోబోటిక్స్‌, డ్రోన్లు, డిజిటల్‌ ట్విన్స్‌తో సంప్రదాయ మౌలిక వసతులను ‘ఇంటెలిజెంట్‌ అసెట్స్‌’గా మార్చాలని సూచించారు. ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్‌లో వృథాగా పోతున్న కోల్డ్‌ ఎనర్జీని డెటా సెంటర్లు, కోల్డ్‌ స్టోరేజీలు, ఎయిర్‌సెపరేషన్‌ యూనిట్లలో వాణిజ్యపరౖంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ ఎండీ అక్షయ్‌కుమార్‌ వెల్లడించారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ఫ్రొఫెసర్‌ బీ.ఎస్‌.మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement