అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి జోన్: ప్రజావాణిలో వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పాండు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 80 వినతులు అందాయని తెలిపారు. కలెక్టరేట్‌లో 50, సంగారెడ్డి డివిజన్‌లో 24, జహీరాబాద్ 5, నారాయణఖేడ్ 1 వినతి అందగా, అందోల్ డివిజన్‌లో ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. అదేవిధంగా మండలస్థాయిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలకు మొత్తం 317 అర్జీలు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా తమకు జీవనాధారమైన భూములను సాగు చేయనీయకుండా కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసి కంచె వేస్తున్నారని కందికి చెందిన మహిళా రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారులు చర్య లు తీసుకొని పంటలు సాగు చేసేలా అనుమతి ఇవ్వాలని కోరారు.


