సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఈనెల 18, 19, 20 తేదీలలో జరిగే యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనరీ సభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని కార్యాలయంలో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పై ప్లీనరీలో విస్తృతంగా చర్చించి, భవిష్యత్‌లో చేపట్టాల్సిన విద్యార్థి ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు జాతీ య, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్, రుక్మిణి, జస్విక, ప్రియాంక, సాహితి, ధరణి, చందన తదితరులు పాల్గొన్నారు.


