పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ వైపు అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మాజీమంత్రి హరీశ్‌రావును కోకాపేటలోని ఆయన నివాసంలో మంగళవారం పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్‌ఎస్ పటాన్‌చెరు మండల ఇన్‌చార్జ్ గడీల శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్‌తో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిట్కుల్ అభివృద్ధి, స్థానిక సమస్యలు, నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై నాయకులు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని కూడా కాంగ్రెస్ నాయకులు కలిశారు. చిట్కుల్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయాలని త్వరలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి: చౌటకుర్ మండలం శివంపేట గ్రామ శివారులో ఉన్న బీరు పరిశ్రమను జిల్లా అదనపు కలెక్టర్ పాండు పీసీబీ అధికారి విజయలక్ష్మితో కలిసి మంగళవారం సందర్శించి తనిఖీ చేశారు. పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలను మంజీరా నదిలోకి వదులుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పదించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశ్రమపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించడంతో అధికారులు పరిశ్రమ అంతటా కలియ తిరిగి ఆరా తీశారు. త్వరలోనే పరిశ్రమపై తగిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు.
జిల్లా పరిషత్ సీఈవో జానకిరెడ్డి
హత్నూర(సంగారెడ్డి): ఎంపీడీవోగా శంకర్ అందించిన సేవలు అభినందనీయమని జిల్లా పరిషత్ సీఈవో జానకిరెడ్డి పేర్కొన్నారు. హత్నూర ఎంపీడీవో గా పదవీ విరమణ పొందిన శంకర్ పుష్పలత దంపతులకు మంగళవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జానకిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎంపీడీవోగా శంకర్ చేసిన సేవలు జీవిత కాలంలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి లేకుండా సౌమ్యంగా పనిచేయించుకుని అధికారుల ఆదేశాలను పాటించిన వ్యక్తి శంకర్ అని ప్రశంసించారు. ఉద్యోగ ధర్మంతోపాటు సమయపాలన పాటిస్తూ ఎప్పుడు ఉన్నతాధికారులకు అందుబాటులో ఉండి సేవలు చేస్తే రిటైర్డ్ అయిన తర్వాత కూడా గుర్తింపు ఉంటుందన్నారు. మండల స్థాయి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు వివిధ పార్టీల నాయకులు శంకర్ దంపతులను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, డీఆర్‌డీఏ అదనపు పీడీ బాలరాజ్, ఇన్చార్జి ఎంపీడీవో యూసుఫ్, తహసీల్దార్ పర్వీన్ షేక్, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పాల్గొన్నారు.
బాధ్యతగా పనిచేయాలి
ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి
కల్హేర్(నారాయణఖేడ్): ప్రజల సమస్యలు తీర్చేందుకు అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి సూచించారు. కల్హేర్‌లో మంగళవారం నిర్వహించిన మండల పరిషత్ సమావేశానికి ఆయన హాజరై మాట్ల్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతీ నెల ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే సమావేశానికి తల్లిదండ్రులు హాజరుకావాలని, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. నీటి సరఫరా, వివిధ సమస్యలను సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తెచ్చారు. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ వినోద్‌పాటీల్, మండల ప్రత్యేకాధికారి అనిల్‌కుమార్, ఎంపీడీఓ హరినందన్‌రావు, ఎంఈఓ సురేశ్, సర్పంచ్‌లు గోవింద్‌నాయక్, సంగన్న, సంతోషమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు.


