బెల్ట్‌షాపులపై దాడులు | - | Sakshi
Sakshi News home page

బెల్ట్‌షాపులపై దాడులు

Jul 28 2026 7:14 AM | Updated on Jul 28 2026 7:14 AM

అక్రమంగా నిల్వ ఉన్న బీరు, మద్యం స్వాధీనం

ఇద్దరిపై కేసు నమోదు

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండలంలోని కట్కూర్‌, చాపగానీతండా గ్రామాల్లో ఉన్న పలు బెల్ట్‌షాపులపై ఆదివారం అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కట్కూర్‌లోని శ్రీనివాస కిరాణాషాపులో అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్న బానోతు ఉమ వద్ద 6 లీటర్ల బీరు, 3.7లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్‌ శాఖ సీఐ పవన్‌, ఎస్‌ఐ దామోదర్‌ పేర్కొన్నారు. అలాగే చాపగానీతండా గ్రామంలో గుగులోతు కొమురయ్య వద్ద 5లీటర్ల బీరు, 3.6లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్‌ ఎస్‌ఐ దామోదర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ కొండల్‌రావు, కానిస్టేబుళ్లు సంపత్‌, శైలజ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement