సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్‌కేర్, అడ్వాన్స్ ఇంజనీరింగ్, డేటాబేస్డ్ టెక్నాలజీ వంటి వాటిల్లో గణితశాస్త అనువర్తనాలను అన్వేషించడానికి రామ్ (రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ అప్‌లైడ్ మాథమెటిక్స్) ఒక వేదిక అవుతుందని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి అన్నారు. రామ్ 4వ అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సదస్సుకు ఐఐటీ హైదరాబాద్ వేదికై ంది. ఈ సదస్సులో దేశంలోని వివిధ ఉన్నత విద్యా సంస్థలతో పాటు, 13 దేశాలకు చెందిన గణిత శాస్త్రవేత్తలు, ఈ రంగంలోని నిపుణులు, వివిధ ఐఐటీలు, ఐఐఎస్‌సీలు, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఎన్‌ఐటీలకు చెందిన ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. విభిన్న రంగాల నుంచి వచ్చే ఆలోచనలు ఒక చోట చేరి, సమస్యలకు పరిష్కారాలను రూపొందించేందుకు ఈ సదస్సులు వేదికవుతాయన్నారు. ఈ సదస్సులో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన గణిత శాస్త్రవేత్తల కీలకోపన్యాసాలు, యువ పరిశోధకులు ప్రసంగాలు చేశారు. ఈ రామ్ సదస్సులు గతంలో దుబాయ్, వారణాసి, కొలంబోలలో జరిగాయి. కార్యక్రమంలో ఐఐటీ ఖారగ్‌పూర్ ప్రొఫెసర్ పీ.వీ.ఎస్.ఎన్.మూర్తి, రామ్ కన్వీనర్ ప్రొఫెసర్ సీ.ఎస్. శాసీ్త్ర, ప్రొఫెసర్ వికాస్‌కృష్ణమూర్తి, ప్రొఫెసర్ జ్యోతిర్మయిరాణ తదితరులు పాల్గొన్నారు.


